నేరేడుచర్ల, కేకే మీడియా సూర్యాపేట జిల్లా నవంబర్27 నేరేడుచర్ల మండల పరిధిలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. కార్తీక పౌర్ణమి అందులోనూ సోమవారం కావడంతో మహిళలు ఉదయం నాలుగు గంటల నుండి ఇంటి ముందు తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని ఆలయాలలో దీపాలు వెలిగించి ఆలయంలో హారతులు అర్పించారు. పురోహితులకు ఉసిరి దీపాలను బియ్యాన్ని కానుకగా మహిళలు ఇచ్చారు. తమకు ఇష్టమైన కార్తీక పౌర్ణమి రోజున మహిళలు ఎంతో ఇష్టంగా తమకిష్టమైన దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించారు.శివన్నామస్మరణతో స్థానిక దేవాలయాలు మార్మోగాయి. శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి శివనామస్మరణతో మార్మోగాయి. పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్న భక్తులు ధ్వజస్తంభాలు, ఉసిరిచెట్ల వద్ద దీపారాధనలు చేసి తరించారు.సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందేలా 365వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.