నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 15:
లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా జాతీయ ఇంజనీర్స్ డే పురస్కరించుకొని నేరేడుచర్ల గరిడేపల్లి మండలాలకు చెందిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్స్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు. సన్మాన గ్రహీతలుగా నేరేడుచర్ల గరిడేపల్లి మండలాల విద్యుత్ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారి, నీటిపారుదల మరియు రెవెన్యూ అధికారులు కు సన్మానం నిర్వహించారు
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చెల్లా ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారి యొక్క సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో లైన్స్ సభ్యులు శ్రీరామ్ రెడ్డి, కొనతం సీతారాం రెడ్డి సుంకర క్రాంతి కుమార్ గుండా సత్యనారాయణ కందిబండ శ్రీను, కర్రీ సూర్యనారాయణ రెడ్డి లక్ష్మారెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు