Friday, March 21, 2025
HomeTelanganaగ్రామపంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం?

గ్రామపంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం?

హైదరాబాద్ కేక్ మీడియా డిసెంబర్ 9
రిజర్వేషన్లు మారేనా..?
పాత రిజర్వేషన్లు. కొనసాగునా…?

తెలంగాణరాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31న ముగియనుంది. 2024 ఫిబ్రవరి నుండి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావలసి ఉంటుంది. 2018 లో పాలకవర్గం రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒక కాలపరిమితి, మరొక 5 సంవత్సరాలకు 2 పర్యాయములు సర్పంచులు, వార్డు సభ్యులు 10 సంవత్సరాల కాలానికి ఓకే రిజర్వేషన్ కొనసాగుతుందని చట్టం చేయడం జరిగింది. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ ప్రక్రియ మారాలని ఉన్న అప్పుడు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీ ప్రత్యేక గెజిట్లు తీసుకువచ్చిన విషయం విధితమే కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వం గత ప్రభుత్వం రూపొందించిన10 సంవత్సరాల కాలపరిమితి మరియు రెండు పర్యాయాల ఓకే రిజర్వేషన్ ప్రక్రియ మారుస్తుందా…? లేదా అనేది రాజకీయ నాయకుల సమాలోచన గ్రామపంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావాహులు ఆశతో రిజర్వేషన్ మారుతుందా…? లేదా అని రాజకీయ నాయకులు సందిద్దo లో ఉన్నారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్ ఆశావాహులు అవకాశం కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వద్ద 224 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు గురించి గవర్నర్ సంతకం కోసం ఫైల్ పెండింగ్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 224 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించిన పెండింగ్ ఫైల్ పై సంతకం పెడితే మొత్తం 12,769 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ గవర్నర్ సంతకం కానీ 224 నూతన గ్రామపంచాయతీలో ఏర్పాటు గురించిన అంశం పెండింగ్లో ఉంటే పాత గ్రామపంచాయతీలు అయిన 12,769 గ్రామపంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2024వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం గా మారనుంది. 2024 గ్రామపంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్తు ఎంపీటీసీ, మరియు జడ్పీటీసీ, ఎన్నికల తో పాటు శాసనమండలి లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రానున్న ఎన్నికలు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో రిజర్వేషన్లు మారుతాయా మారవా అనే సందిగ్నంలో గ్రామస్థాయి మండల జిల్లా స్థాయి నాయకులు ఎదురుచూస్తూ ఉన్నారు. మరి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments