నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 11
పెంచికలదిన్నె గ్రామంలో నడుస్తున్న బెల్టు షాపులు పూర్తిగా బంద్ చేస్తే గ్రామాభివృద్ధికి లక్ష రూపాయలు నజరానా ఇస్తానని క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పెంచికల్ దిన్న మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అన్నారు. గురువారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో మందు విక్రయ కేంద్రాలుగా బెల్ట్ షాపులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో గ్రామ ప్రజలు అప్పుల భారంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు నేరాలు పెరిగిపోతున్నాయని గ్రామంలో విచ్చలవిడిగా అలా అమ్మకాల వల్ల జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారి నియోజకవర్గంలో బెల్టు షాపులు ఎత్తివేసిన గ్రామానికి 5 లక్షల నజరానా ప్రకటించడానికి స్వాగతిస్తూ అతన్ని ఆదర్శంగా తీసుకొని పెంచికలదిన్నె గ్రామంలో కూడా అలాంటి వాతావరణం ఏర్పడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని వెలువరించినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు బెల్ట్ దుకాణదారులు సహకరించి గ్రామం అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరారు.