- నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 2:
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నేరేడుచర్ల ప్రధాన కూడలి వద్ద గ్యాస్ ధరలను తగ్గించాలంటూ టిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. కరోనా తర్వాత దేశంలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం లోకి నెట్టు వేయబడుతున్న పేద మధ్యతరగతి ప్రజానీకానికి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసరాల వస్తువులతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందని దానివల్ల సామాన్యునికి ఎంత భారం పడుతుందో తెలియడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైన కేంద్ర బిజెపి ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే ఇలాంటి నియంత్రణ లేని ధరల పెరుగుదల వల్ల రాష్ట్రంలో దేశంలో బిజెపి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాళీ గ్యాస్ సిలిండర్లతో కట్టెల పోయి తో వంటావార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బతకమ్మలాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుతో నిరసనలతో నినాదాలతో రాస్తారోకో నిర్వహించారు - రాస్తారోకో కార్యక్రమంలో నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, నేరేడుచర్ల టౌన్ పార్టీ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి ఎంపీపీ జ్యోతి జడ్పిటిసి రాపోలు నరసయ్య మార్కెట్ చైర్మన్ శ్రీధర్ పలువురు సర్పంచులు కౌన్సిలర్లు సింగిల్ విండో చైర్మన్లు పార్టీ నాయకులు ప్రజా సంఘ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు