నేరేడుచర్ల కేకే మీడియా జూన్ 24
ఇళ్ల స్థలాల పోరాట కమిటీ పేరుతో నేరేడుచర్ల లో గత ఆరు నెలలుగా ప్రధాన రహదారిపై గత ఆరు నెలలుగా తమకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ వరుస ధర్నాలు నిర్వహించి నేరేడుచర్ల బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని తమకు ఇల్లు కేటాయించాలని 45 రోజులుగా చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఇందులో గుడిసెలు వేయడానికి నీకు హక్కు లేదు ఖాళీ చేయండి అని తెలిపిన వినకపోవడంతో శనివారం ఉదయం పోలీస్ రెవెన్యూ మున్సిపల్ సి బ్బంది జెసిబి లు డోజర్ లతో అక్కడికి వచ్చి ఆక్రమిత గుడిసెలను కూల్చివేశారు. శుక్రవారం నాడు వర్షం పడటంతో అక్కడ రాత్రి బస చేయలేక గుడిసెలు వేసుకున్న వారు లేకపోవడంతో అధికారుల పని సునాయాసమైంది.
గూడు లేని నిరుపేదలమైన మాకు ప్రత్యామ్నాయ వసతి సౌకర్యాలు కల్పించకుండా ఇలా చేయడం సరైన పద్ధతి కాదని. ఇంటి స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పటివరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు