గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల విద్య వ్యవస్థకు తీవ్ర నష్టం
మోడీ తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానం 2020 ని రద్దు చేయాలి
AISF అఖిల భారత విద్యార్థి సమాఖ్య
సూర్యాపేట జిల్లా కేకే మీడియా జన్మదిన 28
సూర్యాపేటలోని, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ వారి నూతన క్యాలెండర్ ను మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆవిష్కరించారు.. తదనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామానికి ఒక ప్రభుత్వ పాఠశాల నెలకొల్పామన్నారు. ఆనాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం గణనీయంగా ఉండేది అన్నారు. కానీ గత పది సంవత్సరాలలో, కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి తెరాస ప్రభుత్వం టీచర్స్ నోటిఫికేషన్ వేయకపోవడం, విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ లను దాదాపు 5వేల కోట్ల రూపాయలను పెండింగ్లో ఉంచడం, రేషనలైజేషన్ పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం లాంటి విద్యా వ్యతిరేక విధానాల వలన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల శాతం పడిపోయింది అన్నారు
నిన్న జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలన్నీ ఒకేచోటకు తీసుకువస్తూ, సొంత భవనాలలో ప్రతి నియోజకవర్గానికి ఒక సమీకృత విద్యహబ్ ఏర్పాటు చేస్తామని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ కాస్మోటిక్ చార్జీలు లు,వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని, ఉపకార వేతనాలకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయాలని సూచించారని వారు అన్నారు
తదనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్ మాట్లాడుతూ, ఈ దేశంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కొరకు ఏర్పడిన మొట్టమొదటి విద్యార్థి సంఘం, ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ అని వారన్నారు.. 1936లో ఏర్పడిన ఏ ఐ ఎస్ ఎఫ్ నాటినుండి చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో అనేక విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, వాటిని పరిష్కరించడంలో ముందుంది అన్నారు, నేడు బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన జాతీయ విద్యా విధానం 2020 తో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను దూరం చేసే కుట్రలో భాగమేనని వారు అన్నారు… నేడు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలను కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం దృష్టికి తమరి ద్వారా తీసుకెల్లి పరిష్కరించాలని దామోదర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో,AISF సూర్యాపేట నియోజకవర్గ నాయకులు కొనపర్తి యశ్వంత్, ఓర్సు మున్నా, తండు విజయ్ కృష్ణ,గడ్డం నాగరాజు, జక్కల అభినయ్, గోపగాని నవీన్,జటంగి మురళి, యరగాని వీరబాబు,ch అఖిల్, సామ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు