హైదరాబాద్ కేకే మీడియా సెప్టెంబర్ 14
రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో పర్యావరణ సమతుల్యం కారణంగా అనేక రకాల విపత్తులు సంభవిస్తున్న విషయం విధితమే.
హిందువులు ఆరాధించే మొట్టమొదటి పూజలు అందుకునే దేవుడైన గణనాథుడి ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాలలో వాడే ఉత్సవ విగ్రహాలు నవరాత్రులు పూజలు అందుకునే విగ్రహాలు తయారు చేసే విధానమే ఇప్పుడు ప్రశ్నగా మారింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో పాటు హాని కరిగించే రంగులు వాడటం పూజా సమయంలో వివిధ వస్తువుల సేకరణకు వాడే ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యాన్ని మనమే మరింతగా పెంచిపోసిస్తున్నాం.
శాస్త్రజ్ఞులు మేధావులు పర్యావరణవేత్తలు ఎంతగా గొంతిత్తి నినదించిన సమస్యకు పరిష్కారం దొరకకపోగా రోజురోజుకు విచ్చలవిడిగా పర్యావరణాన్ని కల్పించడం చేసే చర్యలే చేపడుతున్న పరిస్థితి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పర్యావరణ కాపాడాలని శాస్త్రవేత్తలు మేధావులు చెబుతున్నప్పటికీ నిర్దిష్టమైన ప్రణాళిక తో కట్టడి చేసే విధానం లేకపోవడంతో ఏటేటా విపరీతంగా పెరిగిపోతుంది.
ఇప్పటికే అనేక విపత్తులు సరైన సమయంలో వర్షాలు రాక ప్రపంచనీయ వరదలు భూకంపాలతో భూగర్భ జలాలు ఇంకిపోయి అనేక రకాల సమస్యలు కొత్త కొత్త జబ్బులు ఎదుర్కొంటున్న పరిస్థితులు గమనిస్తున్నాం. ప్రభుత్వాలు స్పందించి పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చి మట్టి వినాయకులను ప్రోత్సహించి ప్లాస్టిక్ రహిత సమాజానికి పాటుపడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు