సూర్యపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 23
లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో గరిడేపల్లి మండలం గడ్డిపల్లి హైస్కూల్లో శుక్రవారం అల్పాహారం కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయరాలు పి. నలిని అధ్యక్షతన క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి, మాజీ రీజియన్ చైర్మన్ సుందరి నాగయ్య ప్రారంభించారు. అల్పాహార దాత గడ్డిపల్లి పాఠశాలలో పనిచేస్తున్న బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ యం. పవిత్ర మన్మధ రెడ్డి దంపతులు 3000 రూపాయల ఆర్థిక సహాయంతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి, సుందరి నాగయ్య, మాట్లాడుతూ గరిడేపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 10వ తరగతి విద్యార్థులకు దాతల సహకారంతో ఈ అల్పాహారం కార్యక్రమాన్ని పేద విద్యార్థులకు అందించడం వలన ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో మంచి ఫలితాలు రావాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో అల్పాహార దాత ఎం. పవిత్ర మన్మధ రెడ్డి దంపతులను లయన్స్ క్లబ్ సభ్యులు,పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జిలకర రామస్వామి,క్లబ్ సభ్యులు విశ్వనాధ్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పి. వీరబాబు, ఏ.కృష్ణయ్య, కె. చిన్నప్ప, జి. రామ్ రెడ్డి, జి. సీతారాం నాయక్,ఆర్. పరంజ్యోతి, కే.కృష్ణవేణి, ఆర్. ధర్మేష్, ఎస్. యాదయ్య. ఎన్ మన్మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.