గజ్వేల్ కేకే మీడియా నవంబర్ 4
నవంబర్ 3న ఉస్మానియా యూనివర్సిటీ, మళ్లీ దశ ఉద్యమ నాయకుడు,
గుర్రంపోడు 540 భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు సపవట్ సుమన్ నాయక్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి నామినేషన్ వేసినాను కేసీఆర్ నువ్వు ఇప్పుడు వరకు ఇచ్చిన ఉచిత హామీలన్నీ ఒకటి కూడా మా గుర్రంపోడు ప్రజలకు గాని మా గిరిజన రైతుల సోదరులకు గాని గిరిజనులకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు చేసింది ఏమీ లేదని ఉచిత హామీల తోటి పబ్బం గడుపుకున్నారని ఇదే గజ్వేల్ నియోజకవర్గం నుండి నీ ఓటమికి నాంది పలుకుతుందని వ్యక్తం చేస్తూ నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ పైన ఇదే నియోజకవర్గంలో 50 వేల ఓట్ల మెజార్టీతో నేను గెలిచి నిన్ను ఫామ్హౌస్కే పరిమితం చేస్తాను విద్యార్థుల బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి ఇటు గిరిజన జాతిని అటు విద్యార్థి లోకాన్ని అయోమయానికి గురిచేసి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలాన్ని నువ్వు నీ కుటుంబం గడుపుకున్నారు ఇక నీ ఆటలు సాగవు నువ్వు ఎక్కడికి పోటీ చేసిన ఈ సపవట్ సుమన్ నాయక్ నీ మీద పోటీ చేయడానికి ఒక గజ్వేల్ నియోజకవర్గం లో ఉన్న నిరుద్యోగులు కాక యావత్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందర్నీ ఏకం చేసి తొలి నామినేషన్ వేసినాను నా నామినేషన్ తో నీ ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేస్తున్నాను అలాగే రేపు నీ మీద కామారెడ్డిలో కూడా నామినేషన్ వేస్తున్న కేసీఆర్ ఇక చాలు నీ డ్రామాలు నీ నాటకాలు నువ్వు చేసిన ఇన్ని రోజు రాజకీయాలు చాలు రాజకీయాలనుండి మీరు తప్పుకొని గౌరవప్రదంగా నాలాంటి నిరుద్యోగులను ఈ నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించగలరని కోరారు