కోదాడ కేకే మీడియా ఆగస్టు 28
గంజాయి మాఫియాకు అధికార బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉందని నల్లగొండ ఎంపీ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి ఆరోపించారు. కోదాడ పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంజాయిని ప్రోత్సహించడం వల్ల యువత చెడు మార్గంలో వెళుతున్నారని ఇది చాలా హేయమైన పని అని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీతోపాటు అనేక రకాల హామీలు ఇస్తా అని మాట ఇచ్చి ఇవ్వకుండా మోసం చేసిందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు