నేరేడుచర్ల కే కే మీడియా మార్చి 24
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో పలు వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ క్షయ వ్యాధికి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సీతామహాలక్ష్మి మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు తో ఇబ్బంది పడే వారు కళ్ళే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ జరిగితే అవసరమైన మందులు వాడి క్షయ వ్యాధి నుండి రక్షణ పొందాలని సమాజంలో క్షయ వ్యాధి విస్తరించకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది మౌనిక , కావేరి , జయమ్మ ,జానమ్మ , ఉపేంద్ర ,అరవిందమ్మ , రమేష్ శారద ఆశా కార్యకర్తలు జానకమ్మ , రాణి తదితరులు పాల్గొన్నారు.