నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 1:
వాసవి మరియు వనితా క్లబ్బులు సేవలు మరింత విస్తృతపరచాలని వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ రాయపూడి భవాని కోరారు. బుధవారం నేరేడుచర్లలో జరిగిన వాసవి , వనితా క్లబ్ లు సంయుక్తంగా నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నేరేడుచర్ల వాసవి క్లబ్ సేవే పరమావధిగా జాతీయంగా , అంతర్జాతీయంగా నిరుపేదలకు విశేష రీతిలో ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు . నేరేడుచర్ల వాసవి క్లబ్ నూతన కార్యవర్గాలు ఏర్పడిన అనతి కాలంలోనే ఇతర క్లబ్బుల కంటే సేవలలో ముందంజలో ఉన్నారని కొనియాడారు. అనంతరం రీజినల్ సెక్రటరీ తిరునగరు పద్మావతి జోన్ చైర్మన్ భువనగిరి లావణ్య లతో కలసి పాక్షికంగా అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద మహిళకు వాకింగ్ స్టాండ్ ను పంపిణీ చేశారు. అంతకుముందు వాసవి క్లబ్ సేవా కార్యక్రమాల రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం రీజనల్ చైర్మన్ రాయపూడి భవాని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి జ్ఞాపికను అందజేసి పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వాసవి , వనితా క్లబ్ అధ్యక్షులు కొత్తా లక్ష్మణ్ వీరవెల్లి శ్రీలత, ప్రధాన కార్యదర్శులు గజ్జల కోటేశ్వరరావు , పోలిశెట్టి సంధ్య, కోశాధికారులు
యీగా భాగ్యలక్ష్మి , పోలిశెట్టి అశోక్ , డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాచకొండ శ్రీనివాసరావు , మాజీ జోన్ చైర్మన్ ,కందిబండ శ్రీనివాసరావు , వాసవి క్లబ్ సభ్యులు ఊటుకూరు నటరాజు , మాశెట్టి మోహన్ , వీరవెల్లి కోటేశ్వరరావు , పాల్వాయి గోపాలకృష్ణ , వాసు ,వెంపటి వెంకన్న , పోతుగంటి సత్యం , వీరవల్లి చిన్నప్పయ్య ,జూలూరు అశోక్ ,పివిటి , కిషన్, కొత్త పద్మావతి ,సువర్ణ , ఇందిరా, లక్ష్మీ ,ప్రసన్న , శోభారాణి , జ్యోతి , కంది బండ నర్మద , కరుణ , కంది బండ కళావతి తదితరులు పాల్గొన్నారు.