హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబరు 24
*హుజూర్ నగర్ పట్టణంలో ప్రత్యేక అలంకరణలో చర్చిలు…
*హుజూర్ నగర్ సెయింట్ జోసెఫ్ చర్చి విచారణ గురువులు ఫాదర్ మారయ్య..
క్రీస్తు చూపిన సన్మార్గం అందరికీ ఆచరణీయమని,తమ పొరుగు వారి పట్ల అందరూ క్షమాగుణం కలిగి ఉండాలని అలాగే కతోలిక విశ్వాసులు తమ పొరుగు వారి పట్ల ప్రేమ,దయ,శాంతి,సహనం కలిగి ఉండాలని హుజూర్ నగర్ సెయింట్ జోసెఫ్ చర్చి విచారణ గురువులు ఫాదర్ మారయ్య అన్నారు.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పట్టణంలోని సెయింట్ జోసెఫ్ చర్చి నందు దివ్య పూజా బలి సమర్పణ గావించారు.ఈ సందర్భంగా ఫాదర్ మారయ్య క్రీస్తు జనన సందేశాన్ని వినిపిస్తూ ఈ లోకజనుల పాప పరిహారనిమిత్తం క్రీస్తు మేరీ మాతకు జన్మించినాడని అన్నారు.స్త్రీలందరూ లోకమాత మేరీ మాతకు ఉన్న ఓర్పు, సహనాన్ని కలిగి ఉండాలన్నారు. లోక రక్షకుడు క్రీస్తు జయంతిని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఆపదలో ఉన్న సాటివారికి సాయం చేయాలని,వర్గ విభేదాలను విడనాడి ప్రజలందరూ సహోదర భావాన్ని, పరమత సహనాన్ని కలిగి ఉండాలని తెలిపారు. తదనంతరం అందరూ దివ్య సప్రసాదాన్ని స్వీకరించారు.క్రీస్తు జయంతి సందర్భంగా కేక్ ను కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిస్టర్స్ అన్నామేరీ,బాలసుందరి, ఆరోగ్యమ్మ,పుష్ప,జానకి,అధిక సంఖ్యలో కతోలిక విశ్వాసులు పాల్గొన్నారు.