ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు
హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్ట్ 12:
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా వేడుకలను సోమవారం నాడు సీనియర్ సివిల్ జడ్జ్ జిట్టా. శ్యాం కుమార్ హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రామిరెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయని, ఒత్తిడి తట్టుకునేందుకు రోజులో కొంత సమయాన్ని కేటాయించాలని దీనివల్ల పని ఒత్తిడి తగ్గుతుందన్నారు. రామస్వామి గుట్ట వెళ్లే దారిలో ని వెంచర్లలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. బార్ అసోసియేషన్ గేమ్ సెక్రటరీ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో క్రికెట్ తో పాటు, చెస్, క్యారమ్స్, సెటిల్ తదితర పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య ,న్యాయవాదులు పాల్గొన్నారు.