నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 18
. క్రాంతినికేతన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నాడు నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదివేల రూపాయల విలువగల ఐఐటి, నీట్ పుస్తకాలను కళాశాల లైబ్రరీకి క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, పెంచికలదిన్నె మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అందజేశారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సైతం అత్యున్నతమైన చదువులు చదివేందుకు ఉపయోగపడే ఐఐటి, జేఈఈ ,నీట్ లాంటి పోటీ పరీక్షలకు హాజరై విజయం సాధించే విద్యార్థులు ఉన్నారని విలువైన పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితులు ఇబ్బందులు కలగకుండా లైబ్రరీలో అందుబాటులో ఉంచితే విద్యార్థులు ఎవరైనా వాటిని వినియోగించుకోనటానికి వీలవుతుందన్న ఉద్దేశంతో కళాశాల అధ్యాపకులు అడిగిన మేరకు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ కు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పు రామకృష్ణ గౌడ్, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు