సూర్యపేట కేకే మీడియా జనవరి 30
… ఎంపీ బడుగుల లింగ యాదవ్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రానికి ఒక ఉన్నతమైన మంత్రి హోదాలో ఉన్నారన్న సంగతి మరిచిపోయి మాట్లాడడం సమంజసం కాదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
మంగళవారం సూర్యపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరిపాలనా కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రజలు అడుగుతున్నారని వెంటనే నెరవేర్చాలని కోరిన సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అగౌరవపరిచారని, వారి దివంగత మంత్రి మాధవరెడ్డి పేరుతో దూషణలకు దిగడం అక్కడ ఉన్న పోలీసులతో ఇక్కడ నుండి వెళ్ళగొట్టండి, కేసులు పెట్టినట్టు శాసించటం, పోలీసులు ఏకపక్ష తోరనిలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న మంత్రి మాటలకు తలగుడం సమంజసం కాదని అన్నారు.
క్యాబినెట్ హోదాలో ఉన్న జడ్పీ చైర్మన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మంత్రి కార్యక్రమం ఉదయం అనుకుంటున్నాడో లేక రాత్రి అనుకుంటున్నాడో అని ఎద్దేవా చేశారు.
వెంకట్ రెడ్డి తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
సమావేశంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక మాట్లాడుతూ క్యాబినెట్ హోదాలో ఉన్న జడ్పీ చైర్మన్ ని అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరైనది కాదని దేశరత్తుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ వై వెంకటేశ్వర్లు, సూర్యాపేట మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శీను పలువురు నాయకులు పాల్గొన్నారు.