కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
ఆఫ్రికాలోని ఉగాండాలో విషాదం చోటు చేసుకుంది. ఆరు గ్రామాలపై కొండచరియలు విరిగి 15 మంది మృతిచెందారు. తూర్పు ఉగాండాలోని పర్వత ప్రాంతమైన బులంబులిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడినట్లు గురువారం అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు వెల్లడించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.