హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 23
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు నిర్వహించిన కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో కు వచ్చిన జన సందోహంలో వర్షం కారణంగా ఆలస్యం కావడంతో ఏడు మండలాల నుంచి వచ్చిన ప్రజానీకంతో హుజూర్నగర్ పట్టణం కిటకిటలాడింది. భోజన సమయం కావడంతో హుజూర్నగర్ పట్టణంలోని హోటల్స్ జన సందోహంతో నిండిపోయాయి. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లే తవ్వలో ఉన్న చిన్ని హోటల్ దశాబ్దాలుగా భోజన ప్రియుల మన్ననలు పొందిన కనకయ్య హోటల్ సందడి సందడిగా మారింది. మాంసాహార ప్రియులకు శ్రేష్టమైన భోజనం అందించే భోజనశాలగా పేరు ఉన్న హోటల్ అరకోర వసతులు ఉన్నప్పటికీ భోజన ప్రియులతో నిండిపోయింది.
సాయంత్రం ఐదు గంటల వరకు వంటలు అందించేందుకు ఇబ్బంది పడ్డ అయ్యేంతవరకు ఉండి మరి భోజనం చేసి వెళ్లారంటే హోటల్ ప్రత్యేకత చెప్పవలసిన అవసరం లేదు.