Wednesday, May 14, 2025
HomeTelanganaకేటీఆర్ అరెస్టు తప్పదా ?

కేటీఆర్ అరెస్టు తప్పదా ?

ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా..? బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొన్న టెన్షన్..

Formula E Race: కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తున్నదా..?

అరెస్ట్ తప్పదా…? కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి..? పార్టీని ఎవరు నడపాలి..?

కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తున్నదా..? అరెస్ట్ తప్పదా…? కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి..? పార్టీని ఎవరు నడపాలి..? కేటీఆర్ అరెస్టయితే.. గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వస్తారా..? ఇలా.. అనేక ప్రశ్నలతో బీఆర్‌ఎస్ క్యాడర్‌లో అయోమయం నెలకొన్నదట.. దిక్కుతోచక… దిగులు పడుతున్న గులాబీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చే రథసారధి ఎవరనే చర్చ జరుగుతోందట ఆ పార్టీలో.. ఇంతకూ గులాబీ పార్టీ పగ్గాలు చేతబట్టి… ముందుకు వెళ్లే నాయకుడు ఎవరు..? బీఆర్ఎస్ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి.. ?

అధికారం కోల్పోయి కష్టాలు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ

అధికారం కోల్పోయి కష్టాలు పడుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి మరో పెద్ద కష్టమే వచ్చి పడింది. ఫార్మూలా ఈ కార్ రేసు రూపంలో వచ్చిన ఆ ఇబ్బందులకు కేటీఆర్‌తో సహా పార్టీ నేతలు దిక్కుతోచక తికమక పడుతున్నారట… ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉందట పార్టీ… ఫార్ములా ఈ రేస్‌ కేసు మాజీ మంత్రి కేటీఆర్‌ మెడకు చుట్టుకుంటే పరిస్థితి ఏంటి..? ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఏసీబీకి చేతికి చేరింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.. కేసులో ఇన్ వాల్వ్ అయిన అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 2న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే అధికారులు విచారణలో తెలిపిన విషయాల ఆధారంగానే కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే సందిగ్ధత నెలకొంది.

మొదట ఇచ్చిన నోటీసులకు ఈనెల 7న విచారణ

ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.. కనుక ఈనెల 7న విచారణకు పిలిచి… ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్‌లో పేద్ద చర్చే జరుగుతున్నది. ఫార్ములా ఈ-కారు రేసు పేరిట రెండు విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్దమొత్తంలో డబ్బులు తరలి వెళ్లాయని అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయనే దానిపై ఏసీబీ లోతుగా విచారణ చేయనుందట అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్‌బీఐ అనుమతి ఉందా..? లేదా..? అనే అంశాలపై సైతం కేటీఆర్‌ను వివరణ అడిగే అవకాశం ఉందట.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments