కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి
కేంద్ర ఆర్థిక సలహాదారు రవీంద్ర కుమార్ జెన
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 11
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలు అర్హులైన పేదలకు చేరాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత్ సంకల్ప యాత్ర చేపట్టారని కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఆర్థిక సలహాదారు రవీంద్ర కుమార్ జెన తెలిపారు.
గురువారం నేరేడుచర్ల కు చేరుకున్న వికసిత భారత సంకల్ప యాత్ర సమావేశాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వివిధ సామాజిక భద్రత పథకాలతో పాటు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి, అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారు లబ్ది పొందాలని కోరారు.కేంద్ర సమాచార, ప్రసార మంత్రత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర రావు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ బాపూజీ, నాబార్డు జిల్లా డీఎం ఎన్.సత్యనారాయణ, ఎస్బీఐ మేనేజర్ ఫణి కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ ప్రోగ్రామ్ మేనేజర్ రత్తయ్య, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు ఆర్థిక కేంద్రం మేనేజర్ జగదీశ్వర్, వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ నాగిని, కౌన్సిలర్ భానోతు లలిత మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి, హెచ్ఎమ్ బట్టు మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు హాజరైన గ్రామస్తులతో 2047 నాటికి అభివృద్ది సాధించడంలో భాగస్వామ్యం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. వివిధ ప్రభత్వ పథకాలు పై కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీడియో వ్యాన్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఉజ్జ్వల యోజన దరఖాస్తులు తీసుకున్నారు.
సభలో వివిధ బ్యాంకుల ప్రతి నిధులు, అధికారులు మాట్లాడుతూ పీఎం జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్, పీఎం స్వానిధి, ముద్ర యోజన, ఆరోగ్య పథకాల గురించి తెలియజేశారు. సదస్సు ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. పీఎం ఉజ్జ్వల యోజన కేంద్రం ఏర్పాటు చేసి దరఖాస్తులు అందించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సలహాదారు జెన ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు వేసిన రంగోలి ముగ్గులు పరిశీలించి అభినందించారు.