TG:
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వేతనం నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ ను కోరారు. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు పొందుతూ కేసీఆర్ శాసన సభకు రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెల్చిన సంగతి తెలిసిందే.