నల్లగొండ కేకే మీడియా:
సాగర్ డెడ్ స్టోరేజ్ కు చేరిన సమయంలో హైదరాబాద్కు తాగునీరు అందించడానికి చేపట్టిన సున్క్షాల పథకం లో సాగర్ నీరు నిండినప్పుడు త్వరగా మార్గంలోకి ఆ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా ప్రస్తుతం ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం నుంచి భారీగా వరద చేరి సాగర్ నిండడంతో నీటి ఒత్తిడికి నిర్మించిన రక్షణ గోడ కూలిపోయింది.
ఆగస్టు ఒకటో తారీకునే రక్షణ గోడ కూలినప్పటికీ అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచింది. అసలేం జరగనట్లుగా కప్పిపుచ్చుకునే ధోరణిలో అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూలిపోయే సమయంలో తీసిన వీడియో ఒకటి బయటపడడంతో విషయం వెలుగులోకి వచ్చి అధికారులు కంగారుపడుతున్నారు. గోడ కూలిన కారణంగా సొరంగ మార్గం పూర్తిగా పూడిపోయింది.
కూలే సమయంలో కూలీలు ఎవరు పని చేయకపోవడం వల్లే పెను ప్రమాదం తప్పింది పంపు హౌస్ లో షిఫ్ట్ కు 115 మంది వరకు కూలీలు పనిచేస్తారు. కొన్ని క్షణాల ముందు అయినా లేక ఆలస్యంగా కూలిన ప్రాణ నష్టం భారీగానే ఉండేది. దీంతో అక్కడ పని కోసం ఉపయోగించే క్రేన్ టిప్పర్ మరియు ఇతర సామాగ్రి నీటిలోనే మునిగిపోయాయి. కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది.
తిరిగి పనులు ప్రారంభం చేయాలంటే వచ్చే వేసవి వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.