హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 31
బీసీ బందుతో ఆర్థిక సహకారం అందించి కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోసారని సుజనగిరి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం హుజూర్నగర్ లో నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ లబ్ధిదారులకు బీసీ బందు ద్వారా అందించే లక్ష రూపాయల చెక్కులను అందజేసిన అనంతరం మాట్లాడుతూ
కార్మికులు కార్మికులు గానే మిగిలిపోకుండా యజమానులు గా మార్చి వారిలో ఆత్మాభిమానం నింపుతూ
నిరుపేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు BC బంధు పధకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న రన్నారు
..తెలంగాణ రాష్ట్రంలోని CM KCR ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది.అని..అభివృద్ధి సంక్షేమం నిజంగా ముందుకు తీసుకుని పోతుంది దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో రాష్ట్రాలు తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను అనుసరిస్తూ ఉన్నారన్నారు
గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. మళ్లీ ఆ పార్టీకి ఒటేస్తే ప్రజల జీవితాలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గములోని 7 మండలాలు 2 మ్యూనిసిపలిటీలలోని బడుగు బలహీన వర్గాలు bc కుల వృత్తుల వారికి 280 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులను అందించడం జరుగుతుందని త్వరలో రెండవ విడత కూడా అమలు చేస్తామని తెలియజేసారు*
ఈ కార్యక్రమములో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు BC కార్పోరేషన్ జిల్లా అధికారులు,మండల అధికారులు,MPDO లు ,నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు..తదితరులు పాల్గోన్నారు