హైదరాబాద్ కేకే మీడియా సెప్టెంబర్ 6
భారతదేశంలో మధ్యతరగతి వ్యవస్థ రోజురోజుకు కృంగి కృషించి కుప్పకూలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత ఆర్థికమాంద్యం ముఖ్యంగా కరోనా విజృంభన అనంతరం ఏర్పడ్డ పరిణామాలు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబాలను మాత్రం పూర్తిగా దిగదర్శిలా తయారు చేశాయి
ఉన్న దానిలో గౌరవంగా కుటుంబ అవసరాలను వారికి వచ్చే ఆదాయాల అంచనాలను బేరిజు వేసుకుంటూ ముందుకు నడుస్తున్న క్రమంలో పెరగని ఆదాయాలు పెరిగిన కుటుంబ ఖర్చులతో
రోజురోజుకు వారి పరిస్థితులు దిగజార్చేలా తయారవుతున్నాయని వాపోతున్నారు.
ఆదాయం పెరగకుండా పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా కుటుంబం గడపాలంటే అప్పులు తప్పనిసరి అప్పులు తీర్చడానికి కొంత సమయం కేటాయించుకుని తీర్చగలిగే పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ప్రస్తుతం అప్పుడు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
దేశంలో ఏర్పడ్డ ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నాయని ఆర్థికంగా కుదరవుతున్న మధ్యతరగతి కుటుంబ వ్యవస్థను వారి ఇబ్బందులను గమనించి ఎలాంటి కార్యాచరణ లేకుండా చేస్తున్నాయని వారి స్థితిగతులు ఆలోచించి చర్యలు చేపట్టకుంటే దేశంలో సగభాగానికి పైగా ఉన్న మధ్యతరగతి వ్యవస్థ కుప్ప కూలిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆచితూచి మరింత కఠిన నిర్ణయాలతో కొంతకాలం పాటు కుటుంబాన్ని నెట్టుకు రాకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే
పైకి గంభీరంగా కనిపించిన రోజువారి ఖర్చులు సైతం దిన దిన గండంగా మెట్టుకు రావలసిన దుస్థితిని ప్రభుత్వాలు ఎలా కాపాడుతాయో , కాలం ఎలా సహకరిస్తుందో వేచి చూడాలి మరి.