నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 12
సంక్రాంతి పండుగ అంటేనే బెల్లం అరిసెలు, ఇతర తీపి తినుబండారాలు చేసుకొని కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు సంతోషంగా ఆనందంగా పంచుకుని తినే పరిస్థితి.
ఎక్సైజ్ అధికారులు సారా తయారీదారులను పట్టుకోలేక ,విక్రయాలను ఆపలేక తినే బెల్లాన్ని కూడా కిరాణా దుకాణాల్లో అమ్మ వద్దంటూ గురువారం రాత్రి నేరేడుచర్ల లోని వివిధ కిరాణా దుకాణాల్లో దాడులు జరిపి బెల్లాన్ని తీసుకువెళ్లడంతో వ్యాపారం చేసుకుని కిరాణా సరుకులలో ఒక భాగమైన బెల్లాన్ని పండగ పూట కొనుగోలు చేసుకునే కస్టమర్లకు ఏ విధంగా అందించాలని వ్యాపారులు వాపోతున్నారు.
పండగ ముందే తయారు చేసుకునే తినుబండారాలకు బెల్లం తప్పనిసరి అలాంటి బెల్లాన్ని సారా తయారీదారులకు విక్రయిస్తున్నారని నెపంతో ఇలా దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎవరి దుకాణాల నుంచి సేకరించిన బెల్లాన్ని వారికి అందజేయాలని సారావిక్రయ కేంద్రాలకు అమ్మితే చర్య తీసుకోవాలని తప్ప ఇలా దాడులు నిర్వహించి తీసుకుపోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.
పండుగకు ఒక్క రోజే సమయం ఉండగా కిరాణా దుకాణాల ఎదుట బారులు తీరిన మహిళలు బెల్లం లేకపోవడంతో విషయం తెలుసుకొని ఎక్సైజ్ అధికారుల తీరు సరైన పద్ధతి కాదని పండుగకు బెల్లం దొరకకుండా చేసిన ఎక్సైజ్ అధికారుల తీరును ఖండిస్తున్నారు