కేకే మీడియా సూర్యాపేట నవంబర్ 4
కార్మిక పక్షపాతి కేసీఆర్
బీఆర్ఎస్ హయాం లో కార్మికులు, కర్షకుల జీవితాల్లో నూతన వెలుగులు
నిరంతర విద్యుత్ పుష్కలమైన నీటితో పరిశ్రమలకు స్వర్గ ధామంగా తెలంగాణ
కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఒక తెలంగాణ రాష్ట్రమే
సూర్యాపేటలో పారిశ్రామిక హభ్ ఏర్పాటే లక్ష్యం
పదివేల మంది యువత కు ఉపాధి కల్పించాలన్నదే నా సంకల్పం
అబద్దాల కాంగ్రెస్కు ఓటేస్తే కరువుకు స్వాగతం పలికినట్లే
మంత్రి జగదీష్ రెడ్డి కు మద్దతుగా ఏకమైన కార్మిక సంఘాలు
సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం
సూర్యాపేట లో మూడోసారి గులాబీ జెండా ఎగరవేయాలని ఏకగ్రీవ తీర్మానం
పెద్ద ఎత్తున హాజరైన కార్మికులు నాయకు
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పనిచేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి , సూర్యాపేట భీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట లోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి బీఆర్టీయూతో పాటు దాని అనుబంధ సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు తరలివచ్చి ముచ్చటగా మూడోసారి సూర్యాపేట గడ్డ పైన గులాబీ జెండా ఎగరేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా కృషిచేశామన్నారు. అతి తక్కువ కాలంలో అని రంగాల్లో అభివృద్ధి సాధించడం తో పాటు కార్మికులను సైతం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఆత్మ గౌరవాన్ని మరింత పెంచుతున్నామన్నారు . 2014కు ముందు కార్మికులు పనిచేసేందుకు కూడా పనిదొరికేది కాదని, ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. కాంగ్రెస్ చెప్పే మాటలు వింటే మళ్లీ పదేండ్లు వెనకకు పోయి కరువు విలయతాండవం చేస్తున్నదన్నారు. కార్మికులు, కర్షకులు ఇతర పార్టీలకు ఓటు వేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి సూర్యాపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీని ఇవ్వాలని కోరారు. నిరంతర విద్యుత్, పుష్కలమైన నీరు లభిస్తున్న తెలంగాణ పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామం గా నిలిచిందన్నారు. దీంతో పెద్దపెద్ద వ్యాపార సమస్యల సైతం తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట జిల్లాలో మెడికల్ కళాశాల , ఇతర జిల్లా కార్యాలయాలు ఏర్పడడం కారణంగా, పాలన చేరువై ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి అన్నారు. ఐటీ హబ్ తో పాటు ఎన్నో అతిపెద్ద వ్యాపార సంస్థలు మాల్స్ మల్టీప్లెక్స్ ఇలా అన్ని రకాల వ్యాపార సంస్థలు ప్రశాంత వాతావరణంలో తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించుకుంటున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సూర్యాపేటను పారిశ్రామిక హభ్ గా తీర్చి దిడ్డడమే తన లక్ష్యమని అన్నారు. తద్వారా పదివేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే సంకల్పంగా ముందుకు వెళ్తానన్నారు. గతంలో సూర్యాపేటలో వ్యాపారాలు చేసుకోవాలంటే ఇటువంటి పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా కార్మికులు ఇచ్చిన మద్దతు తన మీద బాధ్యత పెంచిదన్న మంత్రి, తనపై కార్మిక సోదరులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగ యాదవ్, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గౌడ్, కార్మిక సంఘం నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, చిలువేరు ప్రభాకర్, వెంపటి గురూజీ, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్ శివశంకర్, శివరాం తదితరులు పాల్గొన్నారు.
*గులాబీ జెండా ఎగరవేయడంలో కార్మికులు భాగస్వాములు కావాలి*
-బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎల్లవేళలా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి కారుగుర్తుకు ఓటు వేసి సూర్యాపేట నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరవేయడంలో కార్మికలోకం భాగస్వాములు కావాలని బీఆర్టీయూ రాష్ట్ర ఆధ్యక్షుడు రాంబాబు పిలుపునిచ్చారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా కార్మికులకు లబ్ధి చేకూర్చడంతో పాటు కార్మిక చట్టాల అమలుకు కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కార్మికులంటే ఒక్కతాటిపై, ఒక్కమాటపై ఉండేవారన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్మికుల ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతూ, వారి ఆత్మ గౌరవం నింపేందుకు సంక్షేమ భవనాలను కేటాయించిన జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.