కారులో 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, నగలు.. సీజ్ చేసిన ఈసీ
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉండటంతో పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం అహల్యనగర్ జిల్లాలోని టోల్‌ప్లాజా వద్ద తనిఖీలలో ఓ కారులో విలువైన ఆభరణాలు గుర్తించారు. కారులో లభ్యమైన వజ్రాలు, బంగారం, వెండి నగల విలువ దాదాపు రూ.24 కోట్లు అని అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులు ఆభరణాల విలువకు సరిపోకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.