కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుంటించారు; కారు పూర్తిగా దగ్ధం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాడపల్లి కేకే మీడియా జనవరి 12
వాడపల్లి గ్రామంలో తెల్లవారుజామున సుమారు 1;30. 2:00 గంటల సమయంలో దామరచర్ల మండలం వాడపల్లి గ్రామం లక్ష్మీపురం కాలనీ పరిధిలో రణపొంగు జయరాజు కారు(AP 29 BE 3780 స్విఫ్ట్) ఇంటి ఆరు బయట పార్క్ చేసి ఉంచారు. ఇదే అదునుగా భావించి గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కారు పూర్తిగా దగ్ధమైంది. ఇటీవల కాలంలో రణపొంగు జయరాజు బి ఆర్ఎస్ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ఇది కావాలని నాపై దాడికి దిగాలని నిందితులు వచ్చారని ఇంట్లో మనుషులు ఉండేది చూసి వారు నా కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టారని వాపోయాడు. కావున పోలీసులు విచారణ వేగవంతం చేసి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని దుండగులు పై కఠిన చర్య తీసుకోనీ నాకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ లీడర్ మాజీ సర్పంచ్ ఎల్ వి సత్యనారాయణ మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విచారణ వేగవంతం చేయాలని ఇలాంటి సంఘటనలు కాంగ్రెస్ కార్యకర్తలపై భవిష్యత్తులో జరగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు ఈ విషయమై స్థానిక పోలీసులు విచారణ వేగవంతం చేయాలని ఇలాంటి దాడులు భవిష్యత్తు రోజులో జరగకుండా చూసుకోవాలని, మాజీ సర్పంచులు ఎల్ వి సత్యనారాయణ, సుబ్బయ్య ,బాబు, సైదులు, భతుల శీను, పద్మా రెడ్డి, రామయ్య చెన్నయ్య ,మహమ్మద్ అలీ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరారు