Sunday, September 8, 2024
HomeTelanganaకామ్రేడ్ గుండ్ర జోజి రెడ్డి సేవలు మరువలేనివి.. అనంత ప్రకాష్

కామ్రేడ్ గుండ్ర జోజి రెడ్డి సేవలు మరువలేనివి.. అనంత ప్రకాష్

పాలకీడు కేకే మీడియా డిసెంబర్ 7
మండలంలోని గుడిగుంట్ల పాలెం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ గుండ్ర జోజి రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ హుజూర్నగర్ డివిజన్ నాయకునిగా పాలకీడు మండలంలోని సిపిఎం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఆయనని అన్నారు గ్రామంలో శత్రువుల నుండి అనేక నిర్బంధాలను ఎదుర్కొని కేసులు ఎదుర్కొని పార్టీని కాపాడిన వారిలో ముఖ్యుడని ఆయన అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు

కమ్యూనిస్టులకు గెలుపు ఓటములు సహజమని నిరంతరం ప్రజా సమస్యలపై వాటి పరిష్కారం కోసం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారని పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు తొలగాలని సామాజిక అసమానతలు తొలగాలని కోరుకుంటూ వాటి సాధన కోసం సిపిఎం పనిచేస్తుందని ఆయన అన్నారు జోజి రెడ్డి ఆశయ సాధన అంటే నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల రైతాంగ వ్యవసాయ కార్మికుల
యువజన మహిళల సమస్యలపై వాటి పరిష్కారం కోసం పోరాటమే మార్గమని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దొంగల వెంకటయ్య సిపిఎం మండల నాయకులు దిద్దకుంట పురుషోత్తం రెడ్డి తురికొండ వెంకటేశ్వర్లు గుడ్డేటి నందయ్య దిద్దకుంట్ల రామిరెడ్డి సాముల నాగిరెడ్డి సైదులు కందుల సుజాత విజయ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments