హైదరాబాద్ కేకే మీడియా మార్చ్ 14
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఒకటవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు ఇప్పటివరకు ఎన్నోసార్లు మేధావులు కమ్యూనిస్టు అభిమానులు అభ్యుదయవాదులు సూచించిన కోరుకున్న అది మాటలకే పరిమితం తప్ప చేతలకు కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో గణనీయంగా కామ్రేడ్ల ప్రభావం తగ్గిపోవడంతో నిజమైన కమ్యూనిస్టు కార్యకర్తలు అభిమానులు ఒకంత అసహనానికి గురయ్యారు. నాయకత్వ ఒంటెద్దు పోకడలు కిందిస్థాయి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని చివరికి భంగపడి ఉనికికే ప్రమాదంగా మారిన ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపి వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడుదాం అంటూనే మునుగోడు ఉప ఎన్నికలవేళ సుదీర్ఘకాలంగా అధికార పార్టీకి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా బిజెపి నీ ఓడించేందుకే టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటనలు చేసి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయానికి తోడ్పాటు అందించిన నేపథ్యంలో భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ తో ఉభయ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయని రాష్ట్రంలో తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో నాయకులు ఒకలా క్యాడర్ మరోలా ఆలోచిస్తున్న వేళ ఒకప్పుడు ఒక్క నియోజకవర్గానికి 80-90 వేల ఓట్లు సాధించిన కమ్యూనిస్టు పార్టీలు నేడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు కలిపి కూడా 80000 సాధించకపోవడం కార్యకర్తలను అభిమానులను నిరాశపరిచిన విషయమే అయినప్పటికీ లేటుగా నైనా కామ్రేడ్లు మేల్కొని ఉభయ కమ్యూనిస్టులు కలిసి నడుద్దాం అనే నినాదంతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నందుకు కమ్యూనిస్టు అభిమానులు అభినందిస్తున్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకునేందుకు పొత్తులు ఉన్నా లేకున్నా రెండు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఒక్కతాటిపై నడవాలని ఒకరిపై ఒకరు పోటీ చేసుకోకుండా ఉండాలని రాష్ట్ర స్థాయి నాయకత్వం చర్చలు జరిపి ఏప్రిల్ 9వ తారీఖున హైదరాబాదులో ఉమ్మడి పార్టీ కార్యకర్తలతో ఇరు పార్టీలలో ముఖ్య కార్యకర్తలైన పదివేల మందితో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితిని బట్టి బిజెపి యేతర శక్తితో ముందుకు నడవాలని పోత్తులు ఆలోచన చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీతో పొత్తు అని అనుకుంటున్నా వేళ ఉభయ కమ్యూనిస్టులకు అసెంబ్లీ స్థానాల కంటే ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామన్న అధికార పార్టీ సంకేతాలకు ఇరు పార్టీల కామ్రేడ్లు గరంగరంగా ఉన్నారు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో సైతం పొత్తుకు సిద్ధం కావాలన్నట్టుగా చర్చలు జరుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ ఎప్పుడో కలవాల్సిన కామ్రేడ్లు ఈ చివరి ఘట్టంలో నైనా కలిసికట్టుగా ఒక్కటీగా నిలిచి కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని తెలంగాణలో పెంచేలా ఏ మేరకు కృషి చేస్తారో వేచి చూడాలి