Wednesday, December 11, 2024
HomeDevotionalకాణిపాకం అధికారి ఆకస్మిక బదిలీ

కాణిపాకం అధికారి ఆకస్మిక బదిలీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పట్టణం గురు ప్రసాద్ ఆకస్మిక బదిలీపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా జన జనాభివృద్ధి చెందుతున్న కాణిపాకం దేవస్థానం కు మూడు నెలల్లోనే ప్రభుత్వం ముగ్గురు ఈ ఓ లను బదిలీ చేయడంతో ఆలయాభివృద్ధి కుంటుపడుతోంది గత ప్రభుత్వంలో వైకాపాకు అంట కాగుతూ అత్యంత వివాదాస్పద ఈవోగా పేరు తెచ్చుకున్న ఏ వెంకటేశు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతో రెండు దఫాలుగా సుమారు మూడున్నర ఏళ్ల పాటు ఈవోగా కొనసాగారు ఎట్టకేలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో వివాదాస్పద ఈవో వెంకటేశు ను మాతృ శాఖ రెవెన్యూ కు బదిలీ చేస్తూ జిఐడీలో రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆలయ డిప్యూటీ యోగా విధులు నిర్వహిస్తున్న కే వాణి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టారు అయితే రెండు వారాలు కూడా ఒక ముందే ఆమెను ఈవో బాధ్యతల నుంచి తప్పించి కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ కు ఈవో బాధితులు అప్పగించడంతో ఆయన గత ఆగస్టు 31న ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఉభయదారులు స్థానికుల సహకారంతో విజయవంతంగా నిర్వహించగలిగారు అలాగే అప్పటివరకు ఉన్న దళారి వ్యవస్థను ఆయన అరికట్టగలిగారు నేపథ్యంలో గాడి తప్పిన ఆలయ పాలన గాడిన పడుతూ వచ్చింది సాఫీగా సాగుతున్న సమయంలో ఆలయ ఇవ్వగా విధులు నిర్వహిస్తున్న పట్టెం గురు ప్రసాద్ ను ప్రభుత్వం ఆతస్మికంగా బదిలీ చేస్తూ మరో మారు రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ పెంచల కిషోర్ ను ఆలయ ఇవ్వగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ప్రస్తుతం ఆలయ ఈవో గా పెంచల కిషోర్ ను నియమించిన విషయం స్థానిక ఎమ్మెల్యే కూడా తెలియకుండా జరిగినట్లు తెలుస్తోంది ఆలయంలో పాలన సాఫీగా సాగుతున్నడంతో మరో ఒకటిన్నర సంవత్సరాల కాలంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఈవో గురు ప్రసాద్ ని ఈవోగా కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే నూతన ఈవో ను నియమించే విషయమై ప్రభుత్వం కనీసం మర్యాద కోసం కూడా ఎమ్మెల్యేని సంప్రదించలేదని తెలుస్తోంది రాష్ట్రంలో ఆలయ ఇవాళ బదిలీలో భాగంగా శ్రీశైలం కాణిపాకం అన్నవరం ఆలయాలకు నూతన యువ లను ప్రభుత్వం నియమించింది అయితే ఓ ఎమ్మెల్యే అభ్యంతర వ్యక్తం చేయడంతో శ్రీశైలం ఈవో నియామకం నిలిచిపోయినట్లు తెలుస్తోంది అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతోనే కాణిపాకం ఆలయ ఈవో నియామకం విషయమై స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించలేదనే స్థానికులు వాదనలు వినిపిస్తున్నారు గతంలో ఒకసారి రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి EO గా ఉన్న సమయంలో ఆలయ అధికారులు అర్చకులు స్థానికులు ఉభయదారులు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీటిని సరిదిద్దే క్రమంలో ప్రభుత్వం స్థానికులను ప్రజా ప్రతినిధులను ఏమాత్రం సంప్రదించకుండా ఏకపక్షంగా రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు మరో మారు ఇవ్వగా నియమించడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆలయ పాలన సజావుగా సాగుతున్న సమయంలో ఆకస్మికంగా ప్రస్తుత యువను బదిలీ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఆలయ ఈవో బదిలీ విషయమై ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు మరోమారు పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలయ ఉభయ దారులు ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments