నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 1
కాంట్రాక్టర్ అజాగ్రత్తతో ప్రమాదం జరిగి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వక యువకుడు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో రామాపురం వద్ద కాంట్రాక్టర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా ప్రధాన రహదారిపై డ్రైనేజీ నిర్మాణం కోసం పెద్ద గుంతను తీయగా ఆదివారం రాత్రి మండలంలోని సోమవారం గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకొని రామాపురం రోడ్డు మార్గంలో రాత్రి సుమారు 8 గంటలకు వస్తున్న నేరేడుచర్లకు చెందిన సింగ్ చైతన్య కుమార్ గుంట తీసిన విషయం తెలియక రాత్రివేళ చీకటిలో కనిపించక అమాంతం బండితో సహా గుంటలోకి ఎగిరి పడగా తీవ్ర గాయాలతో ఉండగా సంఘటన చూసిన కొంత మంది గ్రామస్తులు 108కు సమాచారం అందించడంతో 108 లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా తల భాగంలో తీవ్ర గాయాలు తగిలి 16 కుట్లు పడగా కుడి భుజం విరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాంట్రాక్టర్ నిబంధనలు పాటించకుండా ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా ప్రధాన రహదారిపై గుంటలు తోడి ప్రాణాల మీదికి వచ్చి తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న బాధితులు తల్లిదండ్రులు న్యాయం చేయాలని, కాంట్రాక్టర్ పై నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిత్యం రద్దీగా పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఇష్టానుసారంగా గోతులు తీసి కనీస నిబంధనలు పాటించని కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.