కే కే మీడియా సూర్యాపేట జిల్లా పాలకవీడు.
తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ దారుల ఓట్లు,వారి కుటుంబ సభ్యుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయని హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఉన్న 42 వేల పెన్షన్ దారులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తు పై వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించడం ఖాయం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ వికలాంగుల చైర్మన్ ముత్తినెని వీరయ్య,ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు, విజయ సంకల్ప యాత్ర హుజూర్ నగర్ నియోజక వర్గ ఇంఛార్జి మీసాల ఉపేందర్ లు ధీమా వ్యక్తంచేశారు.శనివారం నాడు వారు మండలంలో ముమ్మరంగా విజయ సంకల్ప యాత్ర నిర్వహించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే వికలాంగులకు పెన్షన్ 6000,వితంతువులు, వృద్ధాప్య,కల్లుగీత,చేనేత,బోదకాలు తదితర పెన్షన్లు 4000 చేయూత ద్వారా అందిస్తుందని, వికలాంగులకు రాష్ట్రంలో ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం,తోపాటు అంత్యోదయ కార్డులు మంజూరు చేస్తారని,రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టం 2016ను పటిష్టంగా అమలు చేస్తారని, వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని, ఉపాధి హామీ పథకంలో 150 రోజులు ఉపాధి కల్పిస్తారని పెన్షన్ దారులు అందరూ వారి కుటుంబ సభ్యుల ఓట్లు హస్తం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, శేషు,సుబ్బు గౌడ్,చంటీ,సతీష్,రాజ్ బుడె, సైదిరెడ్డి,ఆరోను,రమేష్,సైదులు,వికలాంగులు,వితంతులు,వృద్ధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.