ఖమ్మం కేకే మీడియా ఆగస్టు 27
తెలంగాణ అమరుల కలను బిఆర్ఎస్ నాశనం చేసిందని కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని బిఆర్ఎస్ ,కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు..ఖమ్మంలో ఆదివారంనాడు నిర్వహించిన రైతు గోస- బీజేపీ భరోసా సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.
కేసీఆర్ సర్కార్ ను గద్దె దింపాలా వద్దా బీజేపీ సర్కార్ కావాలా వద్దా అని అమిత్ షా ఖమ్మం ప్రజలను ప్రశ్నించారు. తిరుపతి వెంకటేశ్వరుడిని స్మరించుకొని ప్రసంగం ప్రారంభిస్తానని అమిత్ షా చెప్పారు.స్థంభాద్రి లక్ష్మీ నరసింహుని సర్మించుకుని ప్రసంగించనున్నట్టుగా తెలిపారు.
ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు పార్టీ మనకు కావాలా అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం చీఫ్ ఓవైసీ పక్కన కూర్చుని తెలంగాణ విమోచన వీరులను కేసీఆర్ అవమానిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అమరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారన్నారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని అమిత్ షా విమర్శించారు.
తెలంగాణలో బిజెపి సర్కార్ వస్తుందని కార్యకర్తలు అందరూ తెలంగాణలో బిజెపి జెండా ఎగరేంతవరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు