హైదరాబాద్ కేకే మీడియా సెప్టెంబర్ 5
కాంగ్రెస్ జాతీయ పార్టీ అత్యున్నత కమిటీ సిడబ్ల్యుసి సభ్యులుగా తెలంగాణకు చెందిన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి ఎన్నికయ్యారు
జాతీయ కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యుసి కమిటీ అత్యున్నతమైన స్థానంగా భావిస్తారు. ఈ కమిటీలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి రాష్ట్రమంత్రిగా ప్రస్తుతం నల్లగొండ పార్లమెంటు సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడిగా మరి ఇతర పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ఉత్తమ్ కు పార్టీలో అత్యున్నతమైన సిడబ్ల్యుసి కమిటీలో చోటుతో మరో అరుదైన గౌరవం దక్కింది.
పార్టీలో విధేయుడుగా గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం సుదీర్ఘ రాజకీయ సంబంధాలతో ఈ పదవి ఉత్తంకు దక్కిందని ఉత్తమ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పదవిలో ఐదు సంవత్సరాల పాటు ఉత్తం కొనసాగనున్నారు.