Monday, December 15, 2025
HomeTelanganaకాంగ్రెస్ ఉగాది కానుక సన్నబియ్యం

కాంగ్రెస్ ఉగాది కానుక సన్నబియ్యం

*కాంగ్రెస్ ఉగాది కానుక సన్నబియ్యం*

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ కి శ్రీకారం చుట్టారని పాలక వీడు మాజీ జెడ్పిటిసి మాలోత్ బుజ్జి మోతిలాల్ నాయక్ తెలిపారు. మంగళవారం పాలకవీడు మండలం బెట్టెతండా గ్రామపంచాయతీ పరిధిలోని పాడ్యా తండాలో ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉన్నత వర్గాలకు సమానంగా నిరుపేదల కడుపు నింపేందుకు ఒక్కో వ్యక్తికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉత్తమ్ కలల పథకం అని ప్రశంసించారు. కార్యక్రమంలో
మాజీ వార్డు సభ్యులు బాలాజీ, నాగ్య, రేషన్ డీలర్ లాలు , గ్రామస్తులు రత్న నాయక్, జగరాం, నాగు మంగ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

*గుండ్లపాడులో*

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంగళవారం పాలక వీడు మండల పరిధిలోని గుండ్లపహాడ్ లో మాజీ ఎంపీపీ భూక్య గోపాల్ మాజీ జెడ్పిటిసి మాలోత్ బుజ్జి మోతిలాల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ వి సుబ్బారావు లు ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments