హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 15
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారం చేపట్టిన నేపథ్యంలో
కాంగ్రెస్కు బలమైన మెజార్టీ రాలేదని భవిష్యత్తు ఏదైనా జరుగుతుందని. కొద్ది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయ ప్రత్యర్ధులు ఎమ్మెల్యేలు అంటున్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పడ్డాక సుదీర్ఘకాలం సుమారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు హ్యాట్రిక్ సాధించి తమ అభిమాన నాయకుడు మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని ఊహించినప్పటికీ అనుహరీతిలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వారి సాంప్రదాయ ఆదిపత్య పోరు తమకి కలిసి వస్తుందని గుద్దగుప్పు తేడా ఉన్న అధికారం మాత్రం మాది అని ఊహించుకున్న టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ తమ మిత్రులైన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో తిరిగి అధికారాన్ని చేపట్టాలనుకున్న స్పష్టమైన మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ను కాదనలేక తమతో కలిసి వచ్చే వర్గాన్ని వెంటనే తీసుకోలేక వేచి చూచే ధోరణిలో ఉన్న క్రమంలో
కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టగా పార్లమెంటు ఎన్నికల వరకు స్తబ్దతగా ఉండి తరువాత తమ రాజ్య నీతిజ్ఞుని ప్రదర్శించి కలిసి వచ్చే అన్ని పార్టీల వర్గాల ఎమ్మెల్యేల మద్దతుతో తిరిగి తెలంగాణలో అధికారాన్ని చేజింగ్కిచ్చుకోవడం ఖాయమని టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు గుసగుసలాడుకుంటున్నారు.
గత పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ఎమ్మెల్యేలు కొంతమంది టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం చొరవతో పూర్తి సహకారంతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని వారంతా కెసిఆర్ కు టచ్ లో ఉన్నారని ఏ క్షణమైనా వారు ఒక్క పిలుపుతో పార్టీ మారే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సమర్థవంతమైన నాయకత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదాసీదా ఆలోచనలతో ఉండడని ఎత్తుకు పై ఎత్తు వేసి వచ్చిన అధికారాన్ని చేజార్చుకోకుండా తన వంతు ప్రయత్నం చేస్తాడని, నిజమైన కాంగ్రెస్ వాదుడు ఎవడు కాంగ్రెస్ అధికారాన్ని పోగొట్టి మళ్లీ వేరే వారి పంచన చేరే అవకాశం ఉండదని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
రాజకీయాలంటేనే వ్యభిచారం కంటే ఘోరంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రేపటి రాజకీయం ఏం జరగబోతుందో అని రాజకీయ మేధావులు ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఏం జరగబోతుందో వేచి చూడాలి మరి.