కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
MEO పానుగోతు చత్రు నాయక్
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 8
నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ సౌజన్యంతో నేరేడుచర్ల మండలంలోని దిర్శిచర్ల, పెంచికల్ దిన్నె, మేడారం, దాసారం సోమారం, చింతకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల యందలి పదవ తరగతి విద్యార్థులు 200 మందికి స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో MEO చత్రు నాయక్ మాట్లాడుతూ
కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని, నిరంతరం సమాజ అభివృద్ధి కోసం పాటుపడడం కొందరికే సాధ్యమవుతుందని ఆ కొందరిలో కస్తూరి చరణ్ ముందుంటారని అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు ప్రధానోపాధ్యాయులు బట్టు మధు అధ్యక్షతన జరిగిన ఇట్టి కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గుడిపాటి కోటయ్య,పిడమర్తి వీరబాబు, ఎలకపల్లి మహేష్,నవీన్ రెడ్డి, మండల పరిధి ప్రధానోపాధ్యాయులు బట్టు మధు ఎల్ శ్రీనివాసరావు పి.సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ కొండయ్య ఉమాపతి రెడ్డి గోపయ్య స్టడీ మెటీరియల్ ని స్వీకరించారు ఉపాధ్యాయులు పద్మావతి మాతంగి సైదులు నరసింహారావు మాధవి స్రవంతి కళ్యాణి భవాని పొన్నం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు