గరిడేపల్లి కేకే మీడియా
సూర్యాపేట జిల్లా కేంద్రంలో. శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 136 వ శతాధిక కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీ చెందిన సతీష్ డప్పు కళా బృందం సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు ప్రముఖ కవి. కత్తిమండ ప్రతాప్. .. సంస్థ జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి …సంస్థ జాతీయ అధ్యక్షులు. ఈశ్వరి భూషణం … ప్రముఖ కవి తెరసం అధ్యక్షులు కేంద్ర సాహిత్య సమితి మండల సభ్యులు. డాక్టర్ నాగేశ్వరం శంకర్. … జిల్లా అధ్యక్షులు పోతుగంటి వీరాచారి. చిరు సన్మానం అందుకున్నారు ఈ సందర్భంగా డప్పు కళా బృందం సభ్యులను పలువురు అభినందనలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో.వంద మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి కవులు పాల్గొని కవితా గానం చేశారు. సతీష్ డప్పు కళా బృందం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డప్పు టీమ్ లీడర్ అమరవరపు సతీష్ టీమ్ సభ్యులు అప్పన్నపేట గ్రామానికి కల్పనా, స్వరూప, నాగమణి, సుజాత, దిర్శించర్ల గ్రామానికి చెందిన అపర్ణ పొనుగోడు గ్రామానికి చెందిన రాణి, రజిత కీతవారిగూడెం గ్రామానికి చెందిన వీరబాబు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.