ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలి :
……….ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి భాను వినోద్ కుమార్
నేరేడుచర్ల. కేకే మీడియా ఆగస్టు 9 :
నేరేడుచర్ల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని ఎస్ఎఫ్ఐ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి భాను వినోద్ కుమార్ కోరారు. శుక్రవారం నేరేడుచర్ల లోని జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి పలు సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో పేద ,మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే చదువుకుంటారని అలాంటి ప్రభుత్వ కళాశాలలో 200 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక లైట్ లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూన్నారని , కనీసం త్రాగునీరు గూడ లేని పరిస్థితి ఉందన్నారు. అలాగే బాలురకు మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బంది గురవుతున్నారని , దూర ప్రాంతంల నుంచి అనేకమంది విద్యార్థులు బస్సుల్లో రావడం జరుగుతుందని కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యావ్యవస్థని బలోపేతం చేస్తామని చెప్పి ఇప్పుడు విద్య పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం,జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు అభి, నేరేడుచర్ల టౌన్ కమిటీ సభ్యుడు సాయి వరుణ్ ,వినయ్ గోపి ,స్వాతి తదితరులు పాల్గొన్నారు