నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 11
సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు పెంచికల్ దిన్నే మాజీ సర్పంచ్ నందమూరి కోటేశ్వరరావు మరణం పార్టీకి తీరని లోటని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నాడు ఆయన దశదినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పెంచికలదిన్నె గ్రామానికి కమ్యూనిస్టు పార్టీకి విడదీయరాని బంధం ఉందని ఒకప్పుడు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన వారిలో నందమూరి కోటేశ్వరరావు ఒకరిని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని ధైర్యాన్ని తెలిపారు. అంతకుముందు పెంచికలదిన్నెలోని సిపిఎం పార్టీ కార్యాలయం అయిన ఓంకార్ భవన్లో ఏర్పాటుచేసిన సంతాప సభలో మాట్లాడారు కమ్యూనిస్టు పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వ దివాలా కోరు పెత్తందారీ వ్యవస్థ పోయేవరకు ప్రతి ఒక్కరు కుశాలన్నారు. పార్టీ కార్యాలయానికి 25 వేల రూపాయల విలువ గల ఫర్నిచర్ ను బహూకరించిన సిపిఎం సానుభూతిపరులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు కొదమగుండ్ల నగేష్ సిరికొండ శీను కుంకు తిరుపతయ్య మాజీ సర్పంచులు మరి నాగేశ్వరరావు సుంకర క్రాంతి కుమార్ బాబురావు శ్రీధర్ ప్రసాదరావు మురళి మధు అప్పారావు శ్యామ్ రవి తదితరులు పాల్గొన్నారు