నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 28
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఊర చెరువులను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్ఎస్పిఏఈ రాజేశ్వరి అన్నారు.
సోమవారం నాడు పెంచికల్ దిన్నే ఊర చెరువు చేపల సొసైటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఊర చెరువు ఆక్రమణకు గురైందని గురవుతోందని దరఖాస్తు అందించిన మేరకు సోమవారం నాడు నేరేడుచర్ల మండల ఎన్నెస్పీ అధికారులు విచారణ చేపట్టారు. చెరువు చుట్టూ హద్దులను పరిశీలించారు. సొసైటీ సభ్యులు ఇచ్చిన దరఖాస్తు వాస్తవమని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎప్.ఎస్. పి. ఏ ఇ. రాజేశ్వరి తెలిపారు. వీరి వెంట వర్క్ ఇప్స్ పెక్టర్ ఆర్. రాము , లష్కర్ ఆర్ . నాగేశ్వరరావు పాల్గొనగా.. ఊర చెరువు సొసైటీ సభ్యులు ఇంజమూరి వెంకటయ్య , యామగాని రాంబాబు , సిరికొండ వెంకటేశం , యడవల్లి వెంకట కృష్ణ , యామగాని నరేష్ , యడవల్లి అరుణ్ హాజరయ్యారు.