కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ డిమాండ్
నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 2
లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కనీస మద్దతు ధరలను పెంచుతూ వస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పటం వల్ల రైతులకు ఒరిగింది ఏమి లేదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన నేరేడుచర్లలో జరిగిన రైతు సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మద్దతు ధర పెంచుతామని ప్రకటించడం తగదని, అందుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గత రెండు లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేస్తామని, అనేక బహిరంగ సభలో మోడీ బహిరంగంగా ప్రకటించారనిఅన్నారు. మోడీ ప్రభుత్వం దొంగ చాటుగా కోర్టులో కేసు వేయించి స్వామినాథన్ కమిషన్ సిపారసు లను అమలు చేయలేదని విమర్శించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేయాలనే డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదన్నారు.
సమావేశo లో తెలంగాణ రాష్ట్ర రైతు కౌలుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కత్తి శ్రీనివాసరెడ్డి, కట్టెకోల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.