హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 24
హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి అధికార బి ఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హుజూర్నగర్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి అభ్యర్థిగా ప్రకటన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు అభిమానులు సై సైనికులు నియోజకవర్గ వ్యాప్తంగా బైకు ర్యాలీగా చిల్లేపల్లి మూసి బ్రిడ్జి వద్ద నుండి గజమాలలతో స్వాగతం పలుకుతూ డీజే మోతలతో డప్పు వాయిద్యాలతో అభిమానులు కేరింతల నడుమ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి మాటలతో కాదు చేతలతో చూపించా అని మరో మరో అవకాశం కల్పిస్తే హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి దశా దిశా మార్చేస్తా అని హామీ ఇచ్చారు. ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాని సమస్యలన్నింటినీ ఒక్కటి ఒక్కటిగా పరిష్కరిస్తూ వచ్చామని 60 ఏళ్ల అభివృద్ధిని నాలుగేళ్లలో చూపించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.
నియోజకవర్గ చివరి గ్రామాలే తెలవని కాంగ్రెస్ నాయకుడు ఏ గ్రామంలో పదిమందిని గుర్తించలేని నాయకుడు ఆరు నెలలకు ఒకసారి చుట్టం చూపుగా వచ్చే నాయకుడు 50 వేల మెజారిటీతో గెలుస్తా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణ దశ దిశ మారి మరింత అభివృద్ధి చెందాలంటే తిరిగి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ సర్కార్ రావాలని
హుజూర్నగర్ లో బిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అతి ముఖ్య నాయకులు వేదికపై ప్రసంగించగా వందలాదిమంది వివిధ గ్రామాల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
చిల్లేపల్లి గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ గరిడేపల్లి గీత వారి గూడెం హుజూర్నగర్ వరకు ర్యాలీ నిర్వహించి పలుచోట్ల ప్రసంగించారు