నేరేడుచర్ల ఆగస్టు 5(కేకే మీడియా
నేరేడుచర్ల మున్సిపాలిటీలో అర్ధరాత్రి కలకలం సృష్టించిన కత్తిపోట్ల గొడవలకు కారణమైన యువకుల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
గొడవను నివారించేందుకు ప్రయత్నించిన యువకుడిపై కత్తితో దాడికి పాల్పడిన ఇరువురు యువకులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై పరమేష్ శనివారం సాయంత్రం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం
ఈనెల 3 న రాత్రి 10 గంటల సమయం లో మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం కు చెందిన వేముల మధు బాబు నేరేడుచర్ల ప్రధాన కూడలిలో తన స్నేహితులతో కలిసి టిఫిన్ చేయుటకు వెళ్ళారు. అక్కడ అదే రామాపురం కి చెందిన చందమల్ల నవీన్ , మణి లు వేరే వాళ్ళతో గొడవ పడుతుండగా మధు ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో నవీన్ మరియు మణి ఇద్దరు కలిసి మధు పై దాడికి పాల్పడి నవీన్ వెనుక నుండి గట్టిగా పట్టుకోగా, మణి తన వద్ద ఉన్న కత్తి తో ఛాతి మీద ఎడమ వైపు మరియు ఎడమ మోచేతి పై కత్తి తో పొడిచి చంపటానికి ప్రయత్నించినట్టు తెలిపారు. కత్తిపోట్లకు గురైన మధును స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా నవీన్ మణి లు పరారైనట్లు, మధు ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపులు చేపట్టగా తొగర్రాయి వద్ద పట్టుబడినట్లు తెలిపారు. ఇరువురు యువకులపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో రాత్రి 10 గంటల లోపు షాప్ లు అన్ని షాపులను మూసి వేయాలని , అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే 100 కు కాల్ చెసీ తెలపాలని ఎస్సై కోరారు.