కేకే మీడియా నేరేడుచర్ల ఆగస్టు 29
మండలంలోని కందులవారి గూడెం గ్రామపంచాయతీని నేరేడుచర్ల ఎంపీడీవో సోమ సుందర్ రెడ్డి గురువారం సందర్శించి ఎఎ పిసి ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. గ్రామములో డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.