హుజూర్నగర్ కేకే మీడియా మార్చి 28
హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోనీ మల్లన్న నగర్ రెండో వార్డు నందు నిర్వహించిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు… అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కండ్లను పరీక్షించి దృష్టిలోపం ఉన్నవారికి కండ్ల అద్దాలను అందిస్తారు అని, ఇంకా ఏమైనా కంటి సమస్యలు ఉన్న వాటికి సంబంధించిన వైద్యం కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.. ప్రతి ఒక్కరూ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని అన్నారు…