నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 19:
హైవే రోడ్డు నిర్మాణం చేపట్టారు కానీ గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేటలో ఉన్న కంకర మిల్లుల నుండి టిప్పర్ల ద్వారా భారీ సంఖ్యలో రోజు కంకర తరలిపోతూ ఉన్న క్రమంలో రోడ్డుపై నిత్యం కంకర జారిపోతూ ఉండడం అటు నుంచి వెళ్లే పాదచారులు వాహనదారులు ముఖ్యంగా బైక్ పై ప్రయాణించే వారి మీద పడుతుండటం రోడ్డు నిండా కంకరతో నిండిపోవడం వాటిపై నుండి పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు టైర్ల వత్తిడికి పక్క వాహనదారుల మీదికి మరియు రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణదారుల మీదికి వెళ్లి ప్రమాదాలు జరుగుతూ ఇబ్బందులకు గురవుతున్న అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరు వచ్చినట్లుగా వ్యవహరిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.
సింగిల్ రోడ్డు గా ఉన్నప్పుడు అదే సమస్య ఇప్పుడు హైవే ఏర్పడ్డాక కూడా కనీసం హైవే వారు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు ఎవరూ దీనిపై దృష్టి సారించకపోవడంతో యదేచ్ఛగా కంకర సప్లై చేసే యజమానులు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా టిప్పర్ బాడీలకు మించి , నిర్ణీత బరువు కంటే ఎక్కువ సామర్థ్యంతో లారీలు స్పీడుగా యదేచ్చగా ప్రయాణం చేస్తూ కంకర జారవిడుచుకుంటూ వెళుతున్న అధికారులు పట్టించుకోవడం పట్ల ప్రజలు తీవ్రతను వ్యక్తం చేస్తున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
కంకర లారీల తో పొంచి ఉన్న ప్రమాదం
RELATED ARTICLES