హుజూర్నగర్ కేకే మీడియా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న హుజూర్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి, ప్రస్తుత ఎమ్మెల్యే తన స్వగ్రామం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం,గుండ్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మేము ఓటు హక్కును వినియోగించు కున్నాము.మరి మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించు కోవాలని,ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని,ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం అని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని అన్నారు.